'ఆగడు' రికార్డుల ఆట మొదలైంది
on Sep 18, 2014
.jpg)
సూపర్ స్టార్ మహేష్ 'ఆగడు' రిలీజ్ కి ముందే రికార్డుల వేట మొదలుపెట్టాడు. టాలీవుడ్ లో సంచలనంగా మారిన 'ఆగడు' విడుదలకు ముందే కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. అమెరికాలో ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా రిలీజ్ కానన్ని థియేటర్ లలో 'ఆగడు' రిలీజవుతోంది. గతంలో పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' 120 స్ర్కీన్లల్లో అక్కడ విడుదలవగా, వినాయకచవితి సంధర్బంగా రిలీజైన ఎన్టీఆర్ ‘రభస' ఆ రికార్డుని బ్రేక్ చేస్తూ 125 కి చేరింది. ఇప్పటి వరకూ ఇదే రికార్డ్. కానీ తాజాగా ‘ఆగడు’ ఈ రికార్డును బద్దలు కొట్టింది. విడుదలకు ముందే ఇన్ని సంచనాలు సృష్టిస్తున్న 'ఆగడు'..సినిమా హిట్టయితే ఇంకెన్ని రికార్డులు బద్దలవుతాయో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



