అభిమానులకు మహేష్ స్వీట్ షాక్
on Jul 23, 2013
"సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు" తర్వాత మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం "1 నేనొక్కడినే". ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానులకు.. షాక్ న్యూస్ స్వీట్ గా అందించాడు మహేష్. ఈ చిత్రాన్ని 2014 సంక్రాంతికి విడుదల కానుందని చెప్పడంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ చిత్రం మలయాళంలో కూడా విడుదల చేయబోతున్నారట. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అసలే మహేష్, దేవీశ్రీప్రసాద్, సుకుమార్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. మరి అభిమానుల కోసం మహేష్ ఇంకోసారి అలోచిస్తాడో లేదో త్వరలోనే తెలియనుంది.