మహేష్, రాజమౌళి ఫ్యాన్స్ కి అగస్ట్ 9 న ఒక్క పండుగ మాత్రమే
on Jul 19, 2024

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)ఫ్యాన్స్ ఇప్పుడు మంచి జోరు మీద ఉన్నారు. క్యాలెండర్ లో అగస్ట్ తొమ్మిదిని రౌండ్ చేసుకొని ఆ డేట్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు ఎప్పుడు వచ్చే పండుగతో పాటు ఇంకో కొత్త పండుగకి శ్రీకారం పడబోతుందనేది వాళ్ల ప్రగాఢ నమ్మకం. కానీ లేటెస్ట్ అప్ డేట్ ఒకటి వాళ్ళ అంచనాలని తారుమారు చేస్తుంది.
అగస్ట్ తొమ్మిది మహేష్ బాబు బర్త్ డే. ఫ్యాన్స్ కొన్ని దశాబ్దాల నుంచి పండుగలా చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఈ ఇయర్ మాత్రం వెరీ వెరీ స్పెషల్ గా నిలిచిపోతుందనుకుంటున్నారు అందుకు కారణం దర్శక ధీరుడు రాజమౌళి(rajamouli)మూవీ. మహేష్ ,జక్కన్న కాంబోలో మూవీ మహేష్ పుట్టిన రోజున స్టార్ట్ అవుతుందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి.దీంతో ఆ శుభముహుర్తం కోసం ఎంతో ఆనందంతో వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇపుడు వాళ్ళ ఆనందానికి చిన్న బ్రేక్ వచ్చేలా ఉందనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.పైగా అందుకు గల కారణాలు కూడా నెట్టింట దర్శనమిస్తున్నాయి. షూటింగ్ ని ఎప్పుడు మొదలుపెట్టాలో స్పష్టత లేనప్పుడు తొందరపడటంఎందుకని మేకర్స్ బావిస్తున్నారనేది ప్రధాన కారణంగా చెప్తున్నారు. అందుకు మహేష్ కూడా మద్దతు తెలిపాడని అంటున్నారు.
ఎందుకంటే ప్రెజంట్ జక్కన్న మూవీకి సంబంధిచిన వర్క్ షాప్ పనుల్లో బిజీగా ఉన్నాడు.ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ కు సంబంధించిన గ్రీన్ మ్యాట్ వర్క్స్ తో పాటు, అవుట్ డోర్ లో తీయాల్సిన ఎపిసోడ్స్ గురించి స్టంట్ మాస్టర్స్ తో చర్చిస్తున్నట్టుగా అంటున్నారు. అదే విధంగా రైటర్స్, ముఖ్యమైన టెక్నీషియన్స్ తో కూడా సిట్టింగ్ లో కూర్చుంటున్నాడనే వార్తలు వస్తున్నాయి. అదే విధంగా ఇంకో పక్క క్యాస్టింగ్ కూడా ఒక కొలిక్కి రాలేదట. రాజమౌళి అడిగితే ఏ ఆర్టిస్ట్ కాదనడు.కానీ డేట్ల విషయంలో సరైన ప్లానింగ్ తో లేకపోతే షూట్ మధ్యలో ఇబ్బందులు వస్తాయి కాబట్టి ముందు ఆర్టిస్టులను లిస్ట్ అవుట్ చేసుకుని కంప్లీట్ గా సినిమాకే ఉండేలా కూడా చర్చలు జరుపుతున్నాడని అంటున్నారు. సో ఫ్యాన్స్ కి చిన్న విన్నపం ఏంటంటే మహేష్, జక్కన్న మూవీ ఎప్పుడు స్టార్ట్ అయ్యినా కూడా శరవేగంగా షూటింగ్ ని పూర్తి చేసుకోవడం గ్యారంటీ.అదే విధంగా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం పక్కా. ఇక మీ కోసం ఆగస్టు తొమ్మిదిన మురారి రీరిలీజ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చెయ్యండి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



