శ్రీమంతుడు డల్ గా ఉన్నాడా?
on Jun 17, 2015
.jpg)
ఈ మధ్య ఓవర్ యాక్షన్ తప్ప యాక్షన్ చేయని ప్రిన్స్ మహేశ్ బాబుని శ్రీమంతుడు టెన్షన్ పెడుతోందట. మొన్నటి వరకూ మహేశ్ సినిమా అంటే ఓ రేంజ్ లో బిజినెస్ జరిగేది. బయ్యర్స్ పోటీపడి మరీ బారులుతీరేవారు. కానీ శ్రీమంతుడికి అంతసీన్ లేదని ఫిల్మ్ నగర్ టాక్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి స్పందన వస్తున్నా...ఆ స్పందన బిజినెస్ పై కనిపించడం లేదంటున్నారు.
మహేశ్ గత చిత్రాలు వన్, ఆగడు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడడంతో శ్రీమంతుడిని చూసి వామ్మో అంటున్నారు. పైగా కొరటాలకు రెండో చిత్రం, నిర్మాతకు మొదటి సినిమా కావడం కూడా మరో కారణం అంటున్నారు. ఇవన్నీ ఒకెత్తైతే ఈనెల 26న రుద్రమదేవి అక్కడకు 15రోజుల తేడాలో అంటే జూలై 10న బాహుబలి విడులవుతుండడంతో తన చిత్రం రిలీజ్ డేట్ ను జూలై మూడోవారం నుంచి ఆగష్టుకు మార్చే ఆలోచనలో ఉన్నట్టు టాక్. మొత్తానికి హుందాగా శ్రీమంతుడికి లోపల మాత్రం సెగలు పుడుతున్నాయట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



