ENGLISH | TELUGU  

మలబార్ గోల్డ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ బాబు

on Mar 7, 2011

Mahesh babu photos, Mahesh babu images, Mahesh babu stills, Mahesh babu wall papers, Mahesh babu picsమలబార్ గోల్డ్ కంపెనీకి మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా మారబోతున్నారట. ప్రముఖ హీరో మహేష్ బాబు ఈ మధ్య బ్రాండ్ అంబాసిడర్ గా యమ బిజీగా ఉన్నారు. ఇప్పటికే మహేష్ బాబు ఆరు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండగా, ఆ ఖాతాలో ఇప్పుడు మరొకటి వచ్చి చేరింది. మహేష్ బాబు మలబార్ గోల్డ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారటానికి కారణం నాగార్జున అని చెప్పొచ్చు. ఆయన ప్రస్తుతం కళ్యాణ్ జ్యూయెలర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు.


ఇది గమనించిన మలబార్ గోల్డ్ కంపెనీ మహేష్ బాబుని తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నిక చేసిందని సమాచారం. మహేష్ బాబు మలబార్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటం వల్ల ఆ కంపెనీ అమ్మాకాలు మన ఆంధ్రాలో పెరుగుతాయని ఆ మలబార్ గోల్డ్ కంపెనీ బలంగా నమ్ముతోంది. ఈ మలబార్‍ గోల్డ్ కంపెనీకి ఇక్కడ మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా కాగా, కేరళలో ప్రముఖ మళయాళ హీరో మోహన్ లాల్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.