భారీ స్థాయిలో 'మహాభారతం'.. అధికారిక ప్రకటన వచ్చింది!
on Sep 10, 2022

ఎన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు తీసినా ఇంకా చెప్పడానికి ఎంతో మిగిలి ఉండే గాథ 'మహాభారతం'. అందులోని కొంత భాగాన్ని లేదా కొన్ని పాత్రలను తీసుకొని ఇప్పటికే ఎందరో ఎన్నో చిత్రాలను రూపొందించారు. దర్శకధీరుడు రాజమౌళి సైతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారతం' అని చెప్పాడు. అయితే రాజమౌళి మహాభారతాన్ని ఎప్పుడు తెరకెక్కిస్తాడో తెలీదు కానీ.. అంతకంటే ముందే సిరీస్ రూపంలో భారీస్థాయిలో 'మహాభారతం' రాబోతుంది.

అల్లు అరవింద్, మధు మంతెన కలిసి ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. మొదట సినిమాగా తెరకెక్కించాలనుకున్నా ఇప్పుడు దానిని సిరీస్ గా తీసుకు రావాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది. పలు సీజన్లుగా రానున్న ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. మొదటి సీజన్ 2024 లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

నటీనటులు, దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ని సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



