ధోని చేతుల మీదుగా 'LGM' ట్రైలర్ లాంచ్!
on Jul 10, 2023

లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ ను నెలకొల్పి 'LGM'(Let's Get Married) అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రమేష్ తమిళ్ మణి దర్శకత్వంలో ధోని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాక్షి ధోని నిర్మిస్తున్నారు. తమిళంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేస్తున్నారు.
చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్, ఆడియో విడుదలకు రంగం సిద్ధమైంది. ఈరోజు(జూలై 10) చెన్నైలో ధోని, సాక్షి చేతుల మీదుగా ట్రైలర్, ఆడియో విడుదల కానున్నాయి. ఈ వేడుక కోసం ధోని దంపతులు ఇప్పటికే చెన్నై చేరుకోగా, అక్కడ వారికి ఘన స్వాగతం లభించింది.
ఇప్పటికే విడుదలైన LGM టీజర్ కు మంచి స్పందన వచ్చింది. కుటుంబం అంతా కలిసి చూసే కామెడీ ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోన్న LGM చిత్రానికి రమేష్ తమిళ్ మణి దర్శకత్వం వహించటంతో పాటు సంగీతం కూడా అందించారు. హరీష్ కళ్యాణ్, ఇవానా, యోగి బాబు, మిర్చి విజయ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



