నితిన్ కి గిఫ్ట్ పంపించిన ఎంఎస్ ధోని
on Nov 29, 2023

నితిన్ హీరోగా రేపు డిసెంబర్ 8 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న మూవీ ఎక్సట్రా ఆర్డినరీ మాన్. ఈ మూవీ కోసం నితిన్ ఫాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవలే వచ్చిన ట్రైలర్ కూడా సినిమా మీద అంచనాలని పెంచింది. తాజాగా నితిన్ కి ఒక విశిష్ట అతిధి నుంచి గిఫ్ట్ రావడంతో నితిన్ ఫాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.
నితిన్ కి ఇండియన్ లెజండరీ క్రికెటర్ ఎం ఎస్ ధోని నుంచి ఊహించని గిఫ్ట్ ఒకటి వచ్చింది. ఎం ఎస్ ధోని తన ఆటోగ్రాఫ్ తో కూడుకున్న ఒక టీ షర్ట్ ని నితిన్ కి కానుకగా పంపించాడు. ఈ మేరకు ధోని పంపిన టీ షర్ట్ తో నితిన్ కెమెరా కి ఫోజు ఇచ్చి ఆ పిక్ ని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం నితిన్ పిక్ వైరల్ అవుతుంది. ఇప్పుడు ధోని చేసిన ఈ పనితో నితిన్ ఎక్సట్రా ఆర్డినరీ మాన్ కి మంచి పబ్లిసిటీ దొరికినట్లయింది. శ్రీలీల ఆ మూవీలో నితిన్ తో జతకట్టనుంది.
ఎం ఎస్ ధోని కి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో సినిమాలన్నా కూడా అంతే ఇష్టం. అందుకు ఉదాహరణగా ధోని చిత్ర రంగ ప్రవేశం చేసి ఎల్ జి ఎం అనే ఒక తమిళ చిత్రాన్ని నిర్మించాడు.ఇంకొన్ని ప్రాజెక్ట్ లు కూడా చర్చల్లో ఉన్నాయి. ఇప్పుడు ధోని నితిన్ కి గిఫ్ట్ పంపించడంతో నితిన్ తో కూడా ధోని ఒక చిత్రాన్ని నిర్మిస్తాడేమో అని అనుకుంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



