పూరి చేసిన ప్రామిస్ తో 100 రోజుల్లో పూనకాలతో ఊగిపోనున్న రామ్ పోతినేని ఫ్యాన్స్
on Nov 29, 2023

రామ్ పోతినేని,పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో 2019 లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ డూపర్ హిట్ అయ్యి రామ్ కెరీర్ లోను అలాగే పూరి కెరీర్ లోను నెంబర్ వన్ చిత్రంగా నిలిచింది. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత వీళిద్దరి కాంబోలో ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ అనే మూవీ రూపుదిద్దుకుంటుంది. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన గుడ్ న్యూస్ ఒకదాన్ని రామ్ అభిమానుల కోసం పూరి వెల్లడి చేసాడు.
రామ్ పోతినేని అండ్ పూరి కలయికలో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ మరో 100 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే మార్చ్ 8 న వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్స్ లో విడుదల కాబోతుంది. రిలీజ్ కి సంబంధించిన పోస్టర్ ని కూడా కొద్దీ సేపటి క్రితమే మేకర్స్ విడుదల చేసారు. దీంతో రామ్ అభిమానుల్లో నయా జోష్ వచ్చినట్లయ్యింది. పోస్టర్ ని చూసి సినిమా ఒక రేంజ్ లో ఉండబోతోందనే అంచనాకి వచ్చేసారు.శరవేగంగా షూటింగ్ జరుపుంటున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ విలన్ గా మెరవబోతున్నాడు.
పూరి ,రామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ డబుల్ ఇస్మార్ట్ మీద ప్రేక్షకుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. అందరి అంచనాలకి తగ్గట్టే పూరి ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్నాడు. లైగర్ పరాజయంతో ఉన్న పూరి ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు .అలాగే రామ్ కూడా ఈ సినిమాతో సరికొత్త రికార్డు లు సృష్టించాలనే పట్టుదలతో ఉన్నాడు. పూరి కనక్ట్స్ పై నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రానికి పూరి, ఛార్మీలు నిర్మాతలుగా వ్యహరిస్తుండగా మెలోడీ బ్రహ్మ మణి శర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



