ఉక్రెయిన్ కు 'టైటానిక్' హీరో భారీ విరాళం.. అమ్మమ్మకు ప్రేమతో
on Mar 8, 2022

రష్యా దాడులతో అల్లాడుతున్న ఉక్రెయిన్ కి తన వంతుగా సాయం అందించడానికి హాలీవుడ్ యాక్టర్, టైటానిక్ ఫేమ్ లియోనార్డో డికాప్రియో ముందుకు వచ్చాడు. ఏకంగా 10 మిలియన్ డాలర్లను(రూ.77 కోట్లు) విరాళంగా ఇచ్చేశాడు. తన అమ్మమ్మ జ్ఞాపకార్థం డికాప్రియో ఈ విరాళం ఇచ్చినట్లు తెలుస్తోంది.
డికాప్రియో అమ్మమ్మ హెలెన్ ఇండెన్‌బిర్కెన్ ఉక్రెయిన్ లో జన్మించారు. అయితే ఆమె కుటుంబం జర్మనీకి వలస వెళ్లింది. జర్మనీలోనే డికాప్రియో అమ్మ జన్మించారు. అమ్మమ్మతో డికాప్రియోకు మంచి అనుబంధం ఉంది. డికాప్రియో నటించిన ప్రతి సినిమా ప్రీమియర్ కు ఆమె హాజరయ్యేవారు. 93 ఏళ్ల వయసులో 2008లో ఆమె మరణించారు.
అమ్మమ్మ మీదున్న ప్రేమతో ఆమె జన్మించిన దేశానికి డికాప్రియో 10 మిలియన్ డాలర్ల భారీ సాయం చేశాడు. కాగా, 25 ఏళ్ల వయసులోనే ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి 'లియోనార్డో డికాప్రియో ఫౌండేషన్'ను స్థాపించిన డికాప్రియో విపత్తుల సమయంలో తన వంతు సాయం చేస్తూ ఉంటాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



