మూడు కోట్లు కట్టకపోతే బ్యాన్ తప్పదు
on Oct 28, 2017

తెలుగులో సూపర్ హిట్ అయిన 100 % లవ్ ని తమిళ్లో 100 % కాదల్ అనే పేరుతో ప్రముఖ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ హీరోగా చంద్రమౌళి అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. తెలుగు లో మంచి ఊపులో ఉన్న లావణ్య త్రిపాఠి ని మొదట హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే, అంతా సెట్ అయి షూటింగ్ వెళ్దాం అనుకునే టైం కి లావణ్య హ్యాండ్ ఇచ్చిందట. ఈ అమ్మడు షూటింగ్ కి రాకపోవడం వల్ల నిర్మాతలకి చాలా నష్టం వచ్చిందట. అర్జున్ రెడ్డి లో విజయ్ దేవరకొండ కి జంటగా నటించిన షాలిని పాండే ని లావణ్య ప్లేస్ లో తీసుకున్నారట. అంతేనా, లావణ్య పైన 3 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని తమిళ్ నిర్మాతల మండలిలో పెట్టారట. ఈ విషయం పై ఒక క్లారిటీ వచ్చే వరకు లావణ్య తమిళ్లో నటించకూడదు అని తీర్మానించారట. సో, అసలే తెలుగులో వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న లావణ్య త్రిపాఠి కి ఈ విషయం పెద్ద తల నొప్పిగా మారిందట. చూద్దాం ఈ విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



