లారెన్సే`లక్ష్మీ బాంబ్` పేలుస్తున్నాడు!!
on Jun 3, 2019
అవును లారెన్స్ `లక్ష్మీబాంబ్` పేలుస్తున్నాడు. ఇటీవల `లక్ష్మీబాంబ్` సినిమా ఫస్ట్ లుక్ అండ్ పోస్టర్ నాకు తెలియకుండా డిజైన్ చేసి దాన్ని రిలీజ్ చేయడంతో నేను హర్ట్ అయ్యాను. కాబట్టి ఆ సినిమా నుంచి నేను తప్పుకుంటున్నాను అంటూ ఇటీవల లారెన్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని గమనించిన అక్షయ్ కుమార్ మరియు ప్రొడ్యూసర్స్ మళ్లీ లారెన్స్ ని పిలిపించి `లక్ష్మీబాంబ్` దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ఈ విషయాన్ని స్వయంగా లారెన్స్ ప్రకటించారు. ` అభిమానులు కోరుకుంటున్నట్టుగానే `లక్ష్మీబాంబ్` చిత్రాన్ని నేనే డైరక్ట్ చేయబోతున్నాను అని తెలియజేయడానికి సంతోషిస్తున్నా. నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకుని సమస్యను పరిష్కరించిన అక్షయ్ కుమార్ గారికి, మా నిర్మాత షబీనా ఖాన్ గారికి థ్యాంక్స్ అంటూ చెప్పుకొచ్చారు. త్వరలో షూటింగ్ ప్రారంభించనున్నారు. కాంచన్ చిత్రానికి రీమేక్ గా `లక్ష్మీబాంబ్` సినిమా తెరకెక్కుతోంది.