విజయ్, సమంత 'ఖుషి'గా వచ్చేస్తున్నారు!
on Mar 23, 2023

విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా 'ఖుషి'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ పై మంచి అంచనాలు ఉన్నాయి. కాశ్మీర్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్ర షూటింగ్ సమంత అనారోగ్యం కారణంగా కాస్త ఆలస్యమైంది. కొద్దిరోజుల క్రితమే మళ్ళీ సమంత ఖుషి సెట్స్ లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ కొత్త విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్.
'ఖుషి' చిత్రాన్ని సెప్టెంబర్ 1న విడుదల చేయబోతున్నట్లు తెలుపుతూ తాజాగా మేకర్స్ కొత్త పోస్టర్ ను వదిలారు. విజయ్, సమంత పాత్రలతో పుస్తకాన్ని తలపించేలా రూపొందించిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. మెడలో ఐడీ కార్డు, చేతిలో లంచ్ బాక్స్ తో ఆఫీస్ కి వెళ్తున్న యువకుడిలా విజయ్ కనిపిస్తుండగా, ఇంటి బాల్కనీలో నిల్చొని కుక్కపిల్లని ఎత్తుకొని ఎంతో హ్యాపీగా ఉన్న యువతిలా సమంత కనిపిస్తోంది. మొత్తానికి పోస్టర్ బ్యూటిఫుల్ గా ఉంది.

హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా మురళి, ఎడిటర్ గా ప్రవీణ్ పూడి వ్యవహరిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



