మహేశ్ బ్యూటీకి అదే మైనస్సా?
on Apr 15, 2015
.jpg)
చక్కని ఒడ్డు, పొడుగు ఉంటేనా కదా అమ్మాయి ఆకట్టుకునేలా ఉంటుంది. కానీ మరీ పొడుగెక్కువైనా కష్టాలే అని తెగ మధనపడిపోతోందట కృతిసనన్. ఫస్ట్ మూవీ మహేశ్ తో కాబట్టి ప్లాబ్లమ్ లేకపోయింది. ఇప్పుడు రిలీజ్ కు సిద్ధంగా ఉన్న దోచెయ్ లో నాగచైతన్యతో రొమాన్స్ చేస్తోంది. చైతూ పొట్టి-కృతి పొడుగ్గా ఉండడంతో ఈ జంట ఎలాఉంటుందో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి కృతి హైట్ మైనస్ అని కూడా అంటున్నారు. దీంతో కృతి చాలా బాధపడుతోందట. చక్కని పొడుగున్నందుకు మోడల్ గా బాగా సక్సెస్ అయ్యా కానీ ఇండస్ట్రీలో ఇదే మైనస్ అయ్యిందే అని ఫ్రెండ్స్ తో చెబుతోందట. గతంలో ప్రేమ, సాక్షి శివానంద్ హైట్ వల్లే కొందరి హీరోలకు మాత్రమే పరిమితమయ్యారని కొందరంటే.... కృతి అనుష్కకు ఈక్వల్ గా ఉంటుంది కాబట్టి....నో ప్రాబ్లమ్ అంటున్నారు. మరి ఎవరి కామెంట్స్ లో నిజముందో? కృతి కెరీర్ ఎలా ఉంటుందో? తెలియాలంటే దోచెయ్ రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



