ఓటీటీలో రానా సమర్పించు కృష్ణుడు?
on May 9, 2020

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన 'లక్ష్మీ బాంబ్'ను ఓటీటీలో విడుదల చేయడానికి నిర్మాతలు రెడీ అవుతున్నారు. ఇటువంటి తరుణంలో చిన్న సినిమాలు ఓటీటీలో విడుదల చేయడం పెద్ద విషయమా? తెలుగులో 'అమృతరామమ్' అని చిన్న సినిమా 'జీ 5'లో విడుదలైంది. త్వరలో మరో సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 'క్షణం' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రవికాంత్ పేరెపు తెరకెక్కించిన రెండో సినిమా 'కృష్ణ అండ్ హిజ్ లీల'. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాకు రానా దగ్గుబాటి సమర్పకుడు. సిద్ధూ జొన్నలగడ్డ హీరో. శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని వడ్నికత్తి హీరోయిన్లు. ఇప్పుడీ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి చర్చలు జరుగుతున్నాయి. అవి ఓ కొలిక్కి వస్తే త్వరలో రిలీజ్ చేస్తారు.
డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సినిమాలను ఓటీటీలో విడుదల చేయవద్దని కోరుతున్నారు. ప్రేక్షకులు ఓటీటీకి అలవాటు పడితే రేపటి రోజున థియేటర్లు ఓపెన్ చేసినప్పుడు రారేమో అని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటీటీలో సినిమాలు విడుదల చేస్తే సదరు హీరోల సినిమాలను బ్యాన్ చేస్తామని తమిళనాడులో హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ, థియేటర్లు ఉన్న సురేష్ బాబు, తమ సురేష్ ప్రొడక్షన్స్ లో రూపొందిన సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని అనుకోవడమే గమనించదగ్గ విషయం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



