కొరటాల కెరీర్ లోనే తొలిసారిగా..
on Nov 23, 2021

వరుస విజయాలతో ముందుకు సాగుతున్న దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. `మిర్చి` (2013), `శ్రీమంతుడు` (2015), `జనతా గ్యారేజ్` (2016), `భరత్ అనే నేను` (2018).. ఇలా కొరటాల ఇప్పటివరకు డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ ముంగిట వసూళ్ళ వర్షం కురిపించాయి. తాజాగా ఈ విజనరీ డైరెక్టర్.. మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో `ఆచార్య` పూర్తి చేశాడు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సోషల్ డ్రామా.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న థియేటర్స్ లో సందడి చేయనుంది.
కాగా, `ఆచార్య` రిలీజయ్యేలోపే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో ఓ పాన్ - ఇండియా మూవీ చేయబోతున్నాడు కొరటాల. రివెంజ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి వెళ్ళనుంది. అక్టోబర్ నాటికి చిత్రీకరణ పూర్తి చేసుకుని.. అదే ఏడాది చివరలో తెరపైకి రానుందని సమాచారం. సో.. వచ్చే సంవత్సరం కొరటాల శివ నుంచి రెండు చిత్రాలు రాబోతున్నట్లే. అదే గనుక జరిగితే.. తన కెరీర్ లోనే తొలిసారిగా ఒకే క్యాలెండర్ ఇయర్ (2022)లో డబుల్ ధమాకా ఇచ్చిన ఘనత కొరటాలకి దక్కుతుంది. మరి.. ఈ రెండు బిగ్ టికెట్ ఫిల్మ్స్ తో కొరటాల శివ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



