Home

»

Latest News

'నాటు నాటు' సాంగ్‌కు పునీత్ స్టెప్స్‌.. వీడియో వైర‌ల్‌!

Nov 23, 2021 3:04PM

 

క‌న్న‌డ ప‌వ‌ర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఇటీవ‌ల తీవ్ర గుండెపోటుకు గురై అశేష అభిమానుల‌ను, స‌న్నిహితుల‌ను శోక‌సంద్రంలో ముంచేస్తూ క‌న్నుమూశారు. ప్ర‌తిభావంతుడైన న‌టుడిగానే కాకుండా గ్రేట్ డాన్సింగ్ స్కిల్స్‌తోనూ ఆయ‌న ప్రేక్ష‌కుల్ని అల‌రించారు. ఇప్పుడ‌ప్పుడే ఆయ‌న‌ను మ‌ర‌చిపోవ‌డం అభిమానుల‌కు సాధ్య‌మ‌య్యే విష‌యం కాదు. కాగా, తాజాగా ఆయ‌న అభిమానులు త‌మ ఆరాధ్య హీరో డాన్స్ మూవ్‌మెంట్స్‌తో 'ఆర్ఆర్ఆర్' మూవీకి సంబంధించిన ఇటీవ‌ల విడుద‌లై సూప‌ర్ పాపుల‌ర్ అయిన 'నాటు నాటు' సాంగ్‌ను కంపోజ్ చేసి, ఆ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాన్ని ప‌లువురు షేర్ చేస్తుండ‌టంతో వైర‌ల్‌గా మారింది. 

ఎం.ఎం. కీర‌వాణి స్వ‌రాలు కూర్చిన 'నాటు నాటు' సాంగ్ యూట్యూబ్‌లో సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. దానికి జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ వేసిన స్టెప్స్ జ‌నాల్ని అమితంగా అల‌రిస్తున్నాయి. తెలుగుతో పాటు త‌మ‌ళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో ఈ పాట‌ను రిలీజ్ చేశారు. 

అలాంటి సాంగ్‌ను పునీత్ ఫ్యాన్స్ త‌మ హీరో డాన్స్ మూవ్‌మెంట్స్‌తో ఎడిట్ చేశారు. సోష‌ల్ మీడియాలో షేర్ అవుతున్న వీడియోలో 'నాటు నాటు' సాంగ్‌కు పునీత్ వేసిన డాన్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ వీడియో ఎడిట‌ర్‌కు ఫ్యాన్స్ నుంచి మంచి ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి. య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'ఆర్ఆర్ఆర్' మూవీ జ‌న‌వ‌రి 7న దేశంలో ఐదు భాష‌ల్లోనూ, ఓవ‌ర్సీస్‌లో కొన్ని విదేశీ భాష‌ల్లోనూ విడుద‌ల‌వుతోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com