పవన్ కోసం కోహినూర్ వజ్రం తీసుకొచ్చిన నిర్మాత!
on Jan 11, 2023

యూత్, మాస్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలే తీస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి ఇప్పటివరకు తాను ఎన్నడు చేయని జానర్ అయిన పీరియాడికల్ మూవీగా హరిహర వీరమల్లు చిత్రం చేస్తున్నారు. ఈ పీరియాడికల్ డ్రామా పై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకు విడుదలైన రెండు గ్లిమ్స్ వీడియోస్ కి అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పవన్ లుక్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఈ సినిమాకి సంబంధించి టీజర్ ను డిసెంబర్ 31వ తేదీన విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి సంబంధించిన వర్క్ పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన భారీ సెట్స్ లో విరామం లేకుండా సాగుతోంది. వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
హరిహర వీరమల్లు ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు గాని పవన్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం కావడంతో దీనికోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. దాంతో ఈ సినిమాకు రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. పవన్‌తో ఖుషి, బంగారం చిత్రాల తర్వాత బడా నిర్మాత ఏయం రత్నం నిర్మిస్తున్న చిత్రమిది. ఆయన ఈ చిత్రం కోసం భారీ బడ్జెట్‌ను కేటాయిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు ఇప్పటికే సగానికి పైగా పూర్తయ్యాయి. తాజాగా మరో షెడ్యూల్ మొదలుపెట్టారు. హరిహర వీరమల్లు సినిమా ఔరంగజేబు చారిత్రక నేపథ్యంలో తెరపైకి రాబోతోంది. ఇది పీరియాడికల్ ఫిక్షన్ మూవీ తెలుస్తోంది.
కాన్సెప్ట్ ఏమిటి అనేది ఎవరికీ క్లారిటీ లేదు. దాన్ని చాలా రహస్యంగా మెయిన్ టెయిన్ చేస్తున్నారు. మన దేశంలో ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్న కోహినూరు వజ్రం గురించి ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఉంటాయి అని తెలుస్తోంది. ఈ వజ్రం చుట్టూనే ఈ సినిమా కథ, హీరో చేసే పోరాటాలు ఆధారపడి ఉంటాయని సమాచారం.
అందుకే ఆ వజ్రం నిజమైనదిగా ఉండాలని భావించిన దర్శకనిర్మాతలు దాదాపు 30 లక్షలు విలువ చేసే ఒక నిజమైన కోహినూర్ లాంటి డైమండ్ ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మరి ఏ ఎమ్ రత్నం ఇంతగా రిస్క్ చేస్తున్నాడు అంటే సినిమాలో ఏదో ఖచ్చితంగా జనాలను మైరిపించి మురిపించే అంశమేదో గట్టిగానే ఉండి ఉంటుందని టాలీవుడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



