ఖలేజా ఫస్ట్ డే నిజమైన కలెక్షన్స్ ఇవే..యుఎస్ లో అయితే మరి దారుణం
on May 31, 2025
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)త్రివిక్రమ్(Trivikram)కాంబోలో 2010 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ ఖలేజా(Khaleja). సూపర్ స్టార్ కృష్ణ(Krishna)జన్మ దినం సందర్భంగా నిన్న మరో సారి వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముందురోజే ప్రీమియర్ షోస్ ని కూడా వేశారంటే ఖలేజాకి ఉన్న క్రేజ్ ని అర్ధం చేసుకోవచ్చు.
ఇక ఈ మూవీ వరల్డ్ వైడ్ గా తొలి రోజు 6 . 5 కోట్ల రూపాయల గ్రాస్ ని వసులు చేసింది. దీంతో ఇండియా వైడ్ గా సెకండ్ హయ్యస్ట్ గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. ఒక్క యుఎస్ లోనే ఇప్పటి వరకు 80 వేల డాలర్స్ కి పైగా వసూళ్లు అందుకొని, రీ రిలీజ్ సినిమాల్లోనే ఒక సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ విషయాన్నీ ఖలేజాని యుఎస్ వ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రత్యంగిరా సంస్థ అధికారకంగా వెల్లడి చెయ్యడమే కాకుండా 'ఎక్స్' వేదికగా స్పందిస్తు ' ఇది నీ దర్శనం,ఇది నిదర్శనం. మేము దీని కోసమే పోరాడాం. యుఎస్ఏ లో ఆల్ టైమ్ రికార్డ్ రీ రిలీజ్ గ్రాసర్ గా నిలిపినందుకు సూపర్ స్టార్ అభిమానులకు ధన్యవాదాలంటు ట్వీట్ చేసింది.
దీంతో మహేష్ బాబుకి యుఎస్(us)ఉన్న క్రేజ్ ఏ పాటిదో మరో సారి అర్ధమయ్యింది. మణిశర్మ సంగీత సారధ్యంలో తెరకెక్కిన ఖలేజా లో మహేష్ సరసన అనుష్క జత కట్టగా కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ప్రకాష్ రాజ్, సుబ్బరాజుతదితరులు కీలక పాత్రలు పోషించారు. సి కళ్యాణ్ సమర్పణలో సింగమనల రమేష్ బాబు నిర్మాతగా వ్యవహరించాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
