భైరవం ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్
on May 31, 2025
బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai srinivas), మంచు మనోజ్(Manchu Manoj),నారా రోహిత్(Nara Rohith)నిన్న 'భైరవం'(Bhairavam)అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి విజయ్ కనకమేడల(VIjay Kanakamedala) దర్శకత్వం వహించగా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పై కె కె రాధామోహన్(kK Radhamohan)అత్యంత భారీ వ్యయంతో నిర్మించాడు.
ఇక ఈ మూవీ తొలి రోజు వరల్డ్ వైడ్ గా 3 .60 కోట్ల రూపాయిల గ్రాస్ ని సాధించింది. యుఎస్ లోనే తొలి రోజు యాభై వేల డాలర్స్ కి పైగా వసూలు చేసింది. దీంతో రాబోయే రోజుల్లో ఏ మేర కలెక్షన్స్ వసూలు చేస్తుందనే ఆసక్తి ఏర్పడింది. చిత్ర యూనిట్ అయితే రీసెంట్ గా సక్సెస్ మీట్ నిర్వహించింది. సాయిశ్రీనివాస్, మంచు మనోజ్,నారా రోహిత్ మాట్లాడుతు మూవీని విజయ వంతం చేసిన ప్రేక్షకులకి ధన్యవాదాలు చెప్పారు.
అదితి శంకర్ హీరోయిన్ గా చేసిన భైరవంలో సంపత్, దివ్యా పిళ్లై, ఆనంది, అజయ్, శరత్ లోహితస్వ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
