కీర్తీ సురేష్... చలో స్పెయిన్!
on Jun 12, 2019
.jpg)
అవును... కీర్తీ సురేశ్ స్పెయిన్ వెళుతున్నారు. కొత్త సినిమా షూటింగ్ కోసం! కీర్తీ సురేశ్ ప్రధాన పాత్రలో నరేంద్రనాథ్ దర్శకత్వంలో మహేశ్ కోనేరు మహిళా ప్రాధాన్య చిత్రం నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ కోసం కీర్తీ సురేశ్, చిత్రబృందం స్పెయిన్ బయలుదేరింది. సుమారు నెల రోజుల పాటు అక్కడే చిత్రీకరణ చేయనున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో, అమెరికాలో కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు. స్పెయిన్ షెడ్యూల్‌తో 80, 90 శాతం సినిమా పూర్తి కానుంది. తర్వాత మిగతా సినిమా పూర్తి చేసి దసరాకు సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానాంశంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. త్వరలో టైటిల్ ప్రకటించే ఆలోచనలో చిత్రబృందం ఉంది. నటకిరీటి రాజేంద్రప్రసాద్, సీనియర్ నటుడు నరేష్, నదియా, భానుశ్రీ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



