కల్యాణ్‌రామ్ నుంచి కబురొచ్చింది!
on Jun 12, 2019
ఎట్టకేలకు నందమూరి కల్యాణ్ రామ్ నుంచి కబురొచ్చింది. '118' విడుదలైన మూడు నెలలకు కొత్త సినిమా కబురు చెప్పారు కల్యాణ్ రామ్. 'శతమానం భవతి', 'శ్రీనివాస కళ్యాణం' వంటి చక్కటి కుటుంబ కథా చిత్రాలు తీసిన సతీష్ వేగేశ్న దర్శకత్వంలో సినిమా చేయనున్నట్టు ప్రకటించారు. ఇదీ కుటుంబ కథా చిత్రమే. నిజానికి, ఈ సినిమా కంటే ముందు నాని హీరోగా 'మజ్ను' తీసిన విరించి వర్మ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ సినిమా చేయాలనుకున్నారు. కానీ, ఎందుకో కుదరలేదు. 'శ్రీనివాస కళ్యాణం' తర్వాత సతీష్ వేగేశ్న కూడా పలువురు హీరోలతో చర్చలు సాగించారు. చివరకు, నందమూరి హీరోతో కుదిరింది. ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఆదిత్య మ్యూజిక్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. కల్యాణ్ రామ్ సరసన మెహరీన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీత దర్శకుడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
