మహానటి అందాల ఆరబోతకు రెడీ అంటోంది!
on Feb 5, 2023

టాలీవుడ్ లో చాలా హుందాగా, పెద్దగా అందాల ఆరబోత చేయకుండా నిండుగా కనిపించే హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. నేను శైలజ చిత్రంతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత మహానటి చిత్రంలో తన నటనతో అందరి చేత శభాష్ అనిపించుకుంది. యూత్ కు చాలా దగ్గరయింది. అయితే ఈమెకు సాయి పల్లవి నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.
మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకుని యూత్ కు దగ్గర అయిన తర్వాత కీర్తిసురేష్ నటించిన చాలా సినిమాలలో హోమ్లీగా కనిపించింది. దాంతో ఆమెకి యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా దగ్గరయ్యారు. మహానటి చిత్రంతో ఈమె ఇండియా వైడ్ గా స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. కానీ ఆ తరువాత వచ్చిన చాలా సినిమాలు వరుసగా పరాజయం పాలయ్యాయి. అయితే అవకాశాలు మాత్రం తగ్గలేదు. మహానటి తరువాత కొన్ని లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసింది. అవి ఆమెకు కలిసి రాలేదు. దాంతో కీర్తి గ్లామర్ ను నమ్ముకుంది. వరుస ఫోటోషూట్లతో యూత్ లో హీట్ ను పుట్టించింది. సర్కారు వారి పాట ముందు వరకు పెద్దగా అందాల ఆరబోత చేయని ఈమె సర్కారు వారి పాటలో భారీగా అందాల ఆరబోత చేసి అందరినీ షాక్ కి గురిచేసింది.
వెండితెరపైనే కాదు.... సోషల్ మీడియాలోనూ ఈమె గ్లామర్ ట్రీట్ తో ఫాలోయర్స్ ను పెంచుకుంటుంది. కమర్షియల్ యాడ్స్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి. తన అందాలను ఆరబోయడంలో ఈమె ఏ మాత్రం తగ్గడం లేదు. ఫుల్ గ్లామర్ ఫీస్ట్ వడ్డిస్తుంది. దాంతో ఈమెను ఎంత అందంగా ఉందో మా మహానటి... వెరీ క్యూట్, సో హాట్.... మరీ ఇంతగా అందాలను ఆరబోస్తోంది ఏంటి?... అంటూ ఆమె ఫాలోయర్స్ తెగ కామెంట్స్ పెడుతున్నారు.
ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న దసరా మూవీలో ఈమె నటిస్తోంది. ఇంతకు ముందు ఈమె నానితో నేను లోకల్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఇక దసరా మూవీలో ఆమె డీ గ్లామర్ పాత్రను చేస్తోంది. ఈ చిత్రం పాటలు, టీజర్లు ఆకట్టుకుంటున్నాయి. భోళాశంకర్ మూవీలో చిరంజీవి చెల్లిగా నటిస్తోంది. తమిళ వేదాళంకు ఇది రీమేక్. మరి ఈ చిత్రాలు కీర్తికి ఏమాత్రం కలిసి వస్తాయో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



