బాలీవుడ్‌కు మహానటి!!
on Mar 4, 2019
మహానటి చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది కీర్తిసురేష్. ప్రస్తుతం ఈమె తెలుగులో ఆచి తూచి సినిమాలను ఎంచుకుంటోంది. తమిళంలో మాత్రం స్టార్ హీరోలతో సినిమా అవకాశాలు చేజిక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఇప్పటికే విజయ్, విక్రమ్,సూర్య లాంటి స్టార్స్ తో నటించిన కీర్తి త్వరలో సూపర్ స్టార్ రజనీకాంత్ తో కూడా నటించినుందని వార్తలు వస్తున్నాయి. ఇక కన్నడ పరిశ్రమ మినహా మిగిలిన సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో నటించి కీర్తికి ఇప్పుడు ఓ బాలీవుడ్ సినిమా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత బోనీకపూర్ ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని కీర్తితో నిర్మించడానికి ఆమెను ఇటీవల సంప్రదించినట్లు సమాచారం. లాస్ట్ ఇయర్ బదాయి హో లాంటి బ్లాక్ బస్టర్ మూవీని అందించిన అమిత్ శర్మ దర్శకత్వంలో లో కీర్తి హీరోయిన్ గా బోనీ కపూర్ సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ లో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.