ఆటగాళ్లు ఎందరున్నా ఆడించేది ఈ శివుడే!
on Nov 30, 2022
కార్తికేయ, నేహా శెట్టి జంటగా క్లాక్స్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'బెదురులంక 2012'. సెప్టెంబర్ లో టైటిల్ ని రివీల్ చేయగా ఆ తర్వాత ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేవు. అయితే తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి సర్ ప్రైజ్ చేసింది మూవీ టీమ్.
'బెదురులంక 2012' ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా విడుదలయ్యాయి. ఈ చిత్రంలో కార్తికేయ 'శివ' అనే పాత్ర పోషిస్తున్నాడు. "కనివిని ఎరుగని ఆట ఇది. ఆటగాళ్లు ఎందరున్నా ఆడించేది ఈ శివుడే" అంటూ విడుదల చేసిన పోస్టర్ లో కార్తికేయ లుక్ ఆకట్టుకుంటోంది. 2012 యుగాంతం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది.
లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో అజయ్ ఘోష్, సత్య, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.