'కార్తికేయ-2' రేర్ ఫీట్.. 100 కోట్ల దిశగా పరుగులు!
on Aug 23, 2022

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన 'కార్తికేయ-2' భారీ కలెక్షన్స్ రాబడుతూ రికార్డులు సృష్టిస్తోంది. ఆగస్టు 13న విడుదలైన ఈ మూవీ వీకెండ్, వీక్ డేస్ అనే తేడా లేకుండా తెలుగు రాష్ట్రాల్లో వరుసగా పదిరోజులు కోటి రూపాయలకు పైగా షేర్ రాబట్టింది. ఈరోజు(11వ రోజు) కూడా అదే జోరు కొనసాగించేలా ఉంది.
పది రోజుల్లోనే బయ్యర్లకు రూ.25 కోట్లకు పైగా లాభాలు తెచ్చిపెట్టిన ఈ చిత్రం.. అత్యధిక లాభాలు పొందిన టాలీవుడ్ మీడియం రేంజ్ సినిమాల లిస్టులో టాప్-5 లో నిలిచింది. త్వరలోనే ఈ మూవీ 'జాతిరత్నాలు'(27.52 కోట్ల ప్రాఫిట్), 'ఫిదా'(30.50 కోట్ల ప్రాఫిట్), ఉప్పెన(31.02 కోట్ల ప్రాఫిట్)లను దాటుకొని టాప్-2 కి వెళ్లేలా ఉంది. మొదటి స్థానంలో 55.43 కోట్ల లాభాలతో 'గీత గోవిందం' ఉంది.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో రూ.11.30 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన 'కార్తికేయ-2'.. పది రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.24.08 కోట్ల షేర్(39.60 కోట్ల గ్రాస్)తో సత్తా చాటింది. పది రోజుల్లో నైజాంలో రూ.9.13 కోట్ల షేర్(బిజినెస్ 3.50 కోట్లు), సీడెడ్ లో రూ.3.83 కోట్ల షేర్(బిజినెస్ 1.80 కోట్లు), ఆంధ్రాలో రూ.11.12 కోట్ల షేర్(బిజినెస్ 6 కోట్లు) వసూలు చేసింది.
తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ ఇండియా, ఓవర్సీస్ లోనూ 'కార్తికేయ-2' జోరు చూపిస్తోంది. నార్త్ లో రోజురోజుకి కలెక్షన్లు పెంచుకుంటూ ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపరుస్తున్న ఈ మూవీ.. యూఎస్ఏ లో అప్పుడే 1 మిలయన్ డాలర్ మార్క్ అందుకొని సత్తా చాటింది.
నార్త్ ఇండియాలో 8.25 కోట్ల షేర్, కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా 2 కోట్ల షేర్, ఓవర్సీస్ 4.40 కోట్ల షేర్ కలిపి.. వరల్డ్ వైడ్ గా పది రోజుల్లో రూ.38.73 కోట్ల షేర్(74.55 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గా 12.80 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ.. పది రోజుల్లోనే బయ్యర్లకు రూ.25 కోట్లకు పైగా లాభాలు తీసుకురావడం విశేషం. ఫుల్ రన్ లో ఈ చిత్రం రూ.100 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



