బిగ్ షాక్.. డైరెక్టర్ లింగుసామికి 6 నెలల జైలు శిక్ష!
on Aug 23, 2022

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుసామిని కొంతకంగా కష్టాలు వెంటాడుతున్నాయి. ఓ వైపు పరాజయాలు, మరోవైపు ఆర్ధిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయనకు తాజాగా భారీ షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో కోర్టు ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.
కొన్నేళ్ల క్రితం ఒక సినిమా తీస్తామని చెప్పి లింగుసామి, ఆయన సోదరుడు సుభాష్ చంద్ర పీవీపీ సంస్థ నుంచి కోటి రూపాయలకు పైగా డబ్బు తీసుకున్నారట. కార్తీ, సమంత జంటగా ఒక సినిమాని ప్లాన్ చేయగా, అది పట్టాలెక్కలేదు. దీంతో తమ డబ్బు తిరిగి ఇవ్వాలని పీవీపీ సంస్థ కోరగా.. లింగుసామి, ఆయన సోదరుడు చెక్ ఇచ్చారట. ఆ చెక్ బౌన్స్ అవ్వడంతో పాటు, వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతో.. పీవీపీ సంస్థ కోర్టుని ఆశ్రయించింది. దీనిపై సోమవారం విచారణ జరిగిన న్యాయస్థానం.. లింగుసామితో పాటు ఆయన సోదరుడికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అయితే ఈ తీర్పుపై లింగుసామి సోదరులు హైకోర్టులో అప్పీల్ కి వెళ్లనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే ఇటీవల తెలుగు, తమిళ భాషల్లో రామ్ పోతినేని హీరోగా 'ది వారియర్' సినిమా తెరకెక్కించాడు లింగుసామి. టాలీవుడ్ ఎంట్రీ కోసం ఎంతో కాలంగా ఎదురుచూసిన ఆయన చివరికి 'ది వారియర్'తో వచ్చి దారుణంగా నిరాశపరిచాడు. ఇది రామ్ కెరీర్ లో ఘోర పరాజయంగా మిగిలిపోయింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



