ఓటీటీలోకి 'కార్తికేయ-2'.. ఎప్పుడంటే?
on Sep 20, 2022

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'కార్తికేయ-2'. ఆగస్టు 13న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం అంచనాలకు మించి విజయం సాధించింది. వరల్డ్ వైడ్ గా రూ.100 కోట్లకు గ్రాస్ రాబట్టి సత్తా చాటింది. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది.
'కార్తికేయ-2' డిజిటల్ రైట్స్ దక్కించుకున్న జీ5.. దసరా కానుకగా అక్టోబర్ 5 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మలయాళం తప్ప మిగతా భాషల్లో అందుబాటులోకి రానుందని సమాచారం. ఎందుకంటే మలయాళ వెర్షన్ సెప్టెంబర్ 23న థియేటర్స్ లో విడుదల కానుంది.
థియేటర్స్ లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న 'కార్తికేయ-2'.. ఓటీటీలోనూ అదేస్థాయిలో ఆదరణ పొందుతుందేమో చూడాలి. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాస్ రెడ్డి, ఆదిత్య మీనన్, హర్ష తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కాలభైరవ ఈ సినిమాకి సంగీతం అందించాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



