క్రిష్ vs కంగన సిస్టర్: ట్విట్టర్ ఫైట్!
on Jan 31, 2019

క్రిష్ ఇంటర్వ్యూల యుద్ధం ముగిసింది. ఇప్పుడు ట్విట్టర్ యుద్ధం మొదలైంది. ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన హిందీ చిత్రం మణికర్ణిక దర్శకత్వం విషయంలో క్రిష్, కంగనా రనౌత్ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వం వహించిన చిత్రంలో కంగనా రనౌత్ పలు మార్పులు చేయడమే కాదు.. కొన్ని సన్నివేశాలకు ఆమె దర్శకత్వం వహించారు. తను స్వచ్ఛమైన బంగారం లాంటి సినిమా తీస్తే.. దాన్ని కంగనా రనౌత్ వెండి గా మార్చిందని, చరిత్రను వక్రీకరించిన ఆమె చిత్ర కథలో మార్పులు చేసిందని, 70 శాతం చిత్రానికి తానే దర్శకత్వం వహించానని కంగనా రనౌత్ చెబుతోందని క్రిష్ ఆరోపించిన సంగతి తెలిసిందే.
హిందీ మీడియాకు ఇచ్చిన వరుస ఇంటర్వ్యూలలో కంగనా రనౌత్ ప్రవర్తనను, ఆమె తీరును క్రిష్ ఎండగడుతూ వచ్చారు. మరోసారి కంగనతో పని చేయనని చెప్పారు. క్రిష్ ఇంటర్వ్యూ ల పై కంగనా రనౌత్ సోదరి రంగోలి ట్విట్టర్ లో సెటైర్లు వేశారు. "క్రిష్... మీరు చెప్పేవన్నీ నిజాలేనని నమ్ముతున్నాం. సినిమాకు మీరే దర్శకత్వం వహించారు. అయితే అందులో కంగనా ప్రధాన పాత్ర చేశారు కదా. ఆమెను ఈ విజయాన్ని ఆస్వాదించని ఇవ్వండి. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. కంగనాను ఒంటరిగా వదిలేయండి" అని రంగోలి ట్వీట్ చేశారు. ఆమెకు క్రిష్ ట్విట్టర్లో బదులిచ్చారు. మణికర్ణిక చిత్రానికి పనిచేసిన పలువురు టెక్నీషియన్లు, నటులు ఆయనకు వ్యక్తిగతంగా పెట్టిన మెసేజ్ లను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 70 నుంచి 80 శాతం వరకు చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించారని వారందరూ ఆయా మెసేజ్ లో పేర్కొన్నారు.
తన ప్రతిభను ఈ విధంగా నిరూపించుకోవాల్సి వస్తుందని ఈనాడు అనుకోలేదని క్రిష్ ఆ మెసేజ్ లు ట్వీట్ చేసే ముందు ట్విట్టర్లో పేర్కొన్నారు. క్రిష్ ఈ మెసేజ్ ఈ మెసేజ్లను పోస్ట్ చేస్తే... కంగనా రనౌత్ సోదరి రంగోలి, మణికర్ణిక చిత్ర విజయానికి ప్రధాన కారణం కంగన అని పలువురు చేసిన ట్వీట్లను రీట్వీట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరిద్దరి ఫైట్ హాట్ టాపిక్!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



