ప్రభాస్ దర్శకత్వంలో అఖిల్!
on Jan 31, 2019

అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటించిన మూడో చిత్రం 'మిస్టర్ మజ్ను' విడుదలైంది. థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సందడి ముగియకముందే 4వ చిత్రంపై అఖిల్ అక్కినేని దృష్టి పెట్టాడు. ప్రభాస్ దర్శకత్వంలో సినిమా చేయడానికి దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే. ప్రభాస్ అంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అనుకునేరు. ఆయన కాదు. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ కు అన్నయ్యగా నటించిన ఆది పినిశెట్టికి ఓ అన్నయ్య ఉన్నాడు. అతడి పేరు సత్య ప్రభాస్. దర్శకుడు. తండ్రి రవిరాజా పినిశెట్టి బాటలో నడుస్తున్నాడు. మెగా ఫోన్ పట్టి సినిమాలు తీస్తున్నాడు. తమ్ముడు ఆది పినిశెట్టి హీరోగా మలుపు అనే చిత్రానికి దర్శకత్వం కూడా వహించాడు. ఆ సత్య ప్రభాస్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని సినిమా చేయనున్నాడు. మార్చిలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. త్వరత్వరగా చిత్రీకరణ పూర్తిచేసి దసరాకు విడుదల చేయాలని అఖిల్ భావిస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



