ఆ అలవాటు నాకు లేదు
on Jul 27, 2017

‘సహచరులతో... అనుచరులతో కలివిడిగా ఉండటం నాకు అలవాటు. కానీ... వారి వ్యక్తిగత జీవితాల్లోకి మాత్రం తొంగిచూడను. అసలు అలాంటి అలవాటు నాకు మొదట్నంచీ లేదు’అని ట్విట్టర్ ద్వారా తన మనోభావాన్ని నిర్మొహమాటంగా తెలిపారు కాటుక కళ్ల కాజల్. తన మేనేజర్ రోనీ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవ్వడంపై ఆమె ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘సమాజానికి చెడు జరిగే ఏ విషయాన్నయినా సరే నేను క్షమించను. తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే. రోని నా మేనేజర్. అతను అలాంటి పని చేస్తాడని నేను కలలో కూడా అనుకోలేదు. నిజంగా నాకు అది పెద్ద షాక్. వృత్తిపరంగా ఒకరినొకరు సహకరించుకోవడమే తప్ప... వ్యక్తిగత విషయాల జోలికి పోను. అతను ఇలాంటివాడని నేను గ్రహించలేకపోవడానికి కారణం అదే.’ అని చెప్పారు కాజల్.
కెరీర్ విషయాన్ని కూడా తాను పెద్దగా పట్టించుకోననీ, అంత తన తల్లిదండ్రులే చూసుకుంటారనీ.. చివరకు తన సినిమాలకు సంబంధించిన డేట్లు, పారితోషికం... లాంటి అంశాలు కూడా అమ్మానాన్నే చూసుకుంటారనీ కాజల్ వివరించారు. కాజల్ మేనేజర్ రోని అరెస్ట్ అవ్వడంతో... ఈ వ్యవహారంలో కాజల్ పాత్ర కూడా ఉండి ఉంటుందని కొందరు భావించారు. అలాంటి అనుమానాలకు తెర దించుతూ కాజల్ ట్విట్టర్ లో తన మనోభాలను వ్యక్త పరిచారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



