హరిహర వీరమల్లు వెనక 250 కోట్లరూపాయలు..నాతోనే మరో సినిమా చెయ్యాలి
on Jun 7, 2025

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ఈ నెల 12 న 'హరిహర వీరమల్లు'(Hari Hara Veeramallu)పార్ట్ 1 తో థియేటర్స్ లో అడుగుపెడుతున్నాడని అందరు ఫిక్స్ అయ్యారు. అందుకు తగ్గట్టే ప్రచార చిత్రాలు కూడా మొదలవ్వడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేకుండా పోయాయి. కానీ అనూహ్యంగా మళ్ళీ రిలీజ్ వాయిదా పడింది. ట్రైలర్ రిలీజ్ రోజు కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటిస్తామని మేకర్స్ అనౌన్స్ చేసారు.
రీసెంట్ గా వీరమల్లు దర్శకుడు జ్యోతికృష్ణ(Jyothikrishna)ఆంధ్రప్రదేశ్ లో బందరు గా పిలవబడే మచిలీపట్నంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతు 'పవన్ కళ్యాణ్ తో వర్క్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. మనలో దాగి ఉన్న టాలెంట్ ని ఆయన ఎంతగానో గుర్తిస్తారు. ఒక్కసారి మనల్ని నమ్మారంటే ఎంతగానో గుర్తు పెట్టుకుంటారు. నన్ను నమ్మి నాతో సినిమా చేసారు. ఇప్పటికే ఆయన మూడు సార్లు సినిమా చూసారు. అరగంట సేపు నన్ను మెచ్చుకోవడమే కాకుండా, నాతో మరో సినిమా చెయ్యాలని ఉందని చెప్పారు. ఆయన ఆ మాట అనడం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. బందర్ పోర్ట్ కి సంబంధించి వీరమల్లులో భారీ సీక్వెన్స్ ఉంది. కథకి తగిన విధంగా సిజి లో ఆ పోర్ట్ ని రీ క్రియేట్ చెయ్యడానికి రెండు సంవత్సరాలు కష్టపడ్డాం. ఈ బ్యాక్ డ్రాప్ లోనే వచ్చే యాక్షన్ సీక్వెన్స్ కూడా ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇందుకోసం పవన్ గారు ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నారు. సుమారు 250 కోట్ల బడ్జెట్ తో వీరమల్లుని తెరకెక్కించామని జ్యోతికృష్ణ చెప్పుకొచ్చాడు.
పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మొట్టమొదటి చారిత్రాత్మక మూవీ వీరమల్లులో, నిధి అగర్వాల్(Nidhhi Agerwal)హీరోయిన్ గా చేస్తుంది. ఇటివల నిధికి సంబంధించిన 'తారతార' సాంగ్ ని రిలీజ్ చేసారు. ఇప్పుడు ఆ సాంగ్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో ముందుకు దూసుకుపోతుంది. బాలీవుడ్ నటుడు బాబీడియోల్ ఔరంగజేబు గా చేస్తుండగా, నర్గిస్ ఫక్రి, నోరా ఫతేహి, సత్యరాజ్, రఘుబాబు, జిష్ణు సేన్ గుప్తా, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. కీరవాణి సంగీత దర్శకుడు కాగా, ఈ మూవీ కొంత భాగానికి క్రిష్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



