ENGLISH | TELUGU  

బ్రిటీష్ బాబు కచేరీలో… చుక్కలు చూసిన ముంబై బాబులు!

on May 13, 2017

 

జస్టిన్ బిబర్… ఎవరో తెలుసా? అదేం ప్రశ్న… అని ఆవేశపడిపోకండి! ఇండియాలో కోట్లాది మందికి బిబర్ ఎవరో తెలియదు. కొందరికి తెలిసినా ఆయన పాడే పాటల్లో ఒక్క ముక్క కూడా అర్థం కాదు. అయినా ఈ మధ్య ముంబైలో జరిగిన మనోడి లైవ్ షోలో అరవై వేల మంది వరకూ పాల్గొన్నారు. 5వేల నుంచీ 70వేల దాకా టికెట్ రేట్లు నిర్ణయించారు ఆర్గనైజర్స్. కాని, వేలకు వేలు పెట్టి టికెట్లు కొనుక్కుని కార్యక్రమానికి వెళ్లిన మ్యూజిక్ లవ్వర్స్ కి మాత్రం చుక్కలు కనిపించాయి. తమ అభిమాన పాప్ సింగర్ కచేరి కాస్తా పెద్ద కచరాగా మార్చేశారట నిర్వాహకులు!

జస్టిన్ బిబర్ వాల్డ్ ఫేమస్ బ్రిటీష్ గాయకుడు. అంటే ఒకప్పటి మైకెల్ జాక్సన్ లాగే అన్నమాట. మైకెల్ డ్యాన్స్ కూడా ఇరగదీసేవాడు కాని… ఇంకా పాతికేళ్లు కూడా నిండని బిబర్ సింగింగ్ కి మాత్రమే బోలెడు ఫేమస్! ఆయన పాటలంటే… మన దగ్గర కొందరు చెవులు కోసుకుంటారు. మిగతా వారు చెవులు మూసుకుంటారు. అది వేరే విషయం! అయితే, బిబర్ ప్రత్యక్షంగా పాడుతుంటే వినాలని షోకు ఎగబడిన ఇండియన్ ఆడియన్స్ కి భలే షాక్ ఎదురైంది. బిబర్ ఊరికే లిప్ సింకింగ్ చేశాడట. అసలు పాట వెనుక ప్లే అవుతుంటే … ఆయన కేవలం పెదవులు కదిపి పని కానిచ్చాడట! ఈ మాత్రం దానికి టీవీలోనో, యూట్యూబ్ లోనో చూసుకుంటే సరిపోయేది కదా అనుకుంటున్నారు జనం!

కేవలం పాటలు పాడకపోవటమే కాదు… జస్టిన్ బిబర్ షోలో ఇంకా నానా రచ్చ జరిగిందట! 5వేల రూపాయల టికెట్లు కొన్న వాళ్లు, 15వేల రూపాయల టికెట్లు కొన్న వారు … అందరూ ఒకే దగ్గర కూర్చుని కార్యక్రమం చూడాల్సి వచ్చిందట! ఇక 35వేల రూపాయల రేట్ వున్న టికెట్స్ కొన్న వారి పరిస్థితి కూడా అలానే వుండిందట. వారికి 15వేల రూపాయల టికెట్ పైన వచ్చే ఫెసిలిటీస్ కూడా రాలేదు కాని… డబ్బులు 35వేలు తీసుకున్నారు! టికెట్ల కోసం 70వేల కంటే ఎక్కువ డబ్బు తగలేసిన వారి ఏడుపైతే మరీ దారుణంగా వుంది. తమని సెలబ్రిటీల్లా ట్రీట్ చేస్తామని ఊరించిన ఆర్గనైజర్స్ పట్టించుకోలేదని వాపోతున్నారు!

ఇండియాలో బట్టల దుకాణాలు ఓపెన్ చేయటానికి నాలుగైదు సినిమాలు చేసిన హీరోయిన్ వస్తేనే రోడ్లు జామైపోతాయి. పట్టుచీర కట్టుకుని వచ్చిన అందగత్తెను చూడటానికి వచ్చిన పిచ్చి జనాన్ని అస్సలు పట్టలేం. పోలీసులు లాఠీ ఛార్జ్ చేసేదాకా వెళుతుంది. ఇక బిబర్ లాంటి అంతర్జాతీయ స్టార్ వస్తే మనోళ్ల వెర్రిని ఆపగలమా? ఎగబడ్డారు. భంగపడ్డారు. మొత్తం మీద షో నిర్వహించిన కంపెనీ వాళ్లు లాభపడ్డారు!


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.