అఫీషియల్.. 'బింబిసార' కోసం 'భీమ్' వస్తున్నాడు
on Jul 26, 2022

నందమూరి కళ్యాణ్ రామ్ టైటిల్ రోల్ పోషిస్తున్న లేటెస్ట్ మూవీ 'బింబిసార'పై నందమూరి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి నెలకొంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కె.హరికృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకి మల్లిడి వశిష్ఠ్ దర్శకుడు. ఈ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ ఆగష్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. జూలై 29న జరగనున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ తాజాగా మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
'బింబిసార' ప్రీరిలీజ్ ఈవెంట్ జూలై 29న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరగనుంది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా తారక్ వస్తున్నట్లు తాజాగా మేకర్స్ ట్విట్టర్ వేదికగా ఒక వీడియో ద్వారా ప్రకటించారు. ఆ వీడియో క్లిప్ లో 'జై లవ కుశ'లోని జై(రావణ) విజువల్స్ కి 'బింబిసార' మ్యూజిక్ జోడించడం ఆకట్టుకుంది. అలాగే 'NTR 30' అనౌన్స్ మెంట్ వీడియోలో తారక్ చెప్పిన 'వస్తున్నా' డైలాగ్ ని కూడా ఈ వీడియో క్లిప్ కి జోడించారు. 'బింబిసార' ఈవెంట్ కి తారక్ వస్తున్నాడని తెలిసి నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం తారక్ లుక్ ఎలా ఉంది?, 'బింబిసార' గురించి ఏం మాట్లాడతాడు?, 'NTR 30' గురించి ఏమైనా చెప్తాడా? అని ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది.
ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తుండటం విశేషం. ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో కేథరిన్ థ్రెసా, సంయుక్త మీనన్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో అలరించనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



