'టెంపర్' ఆడియో రిలీజ్ డేట్
on Jan 20, 2015
ఎన్టీఆర్, పూరీజగన్నాధ్ కాంబినేషన్ లో రాబోతున్న ‘టెంపర్’ ఆడియో రిలీజ్ డేట్స్ ఫిక్సయింది. జనవరి 26 రిపబ్లిక్ డే రోజున అభిమానుల సమక్షంలో గ్రాండ్గా శిల్పకళావేదికలో ఫంక్షన్ చేయనున్నట్లు సమాచారం. సినిమా మాత్రం ఫిబ్రవరి 5 లేదా 12 న సినిమా రిలీజ్ కావచ్చునని అంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ మినహా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణ మురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జీ, వెన్నెల కిషోర్, జయప్రకాష్ రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమా ప్రభ, పవిత్ర లోకేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.అనూప్ మ్యూజిక్ అందిస్తున్నాడు.