తారక్, జాన్వీని కలిపే డైరెక్టర్ అతనేనా?
on Jul 20, 2022

'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన 30వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో, 31వ సినిమాని ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేయనున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత నేషనల్ అవార్డు విన్నర్, కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ లో బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జాన్వీ కపూర్ సౌత్ ఎంట్రీ గురించి ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. 'NTR 30' లేదా 'NTR 31'లో నటించే అవకాశముందని కూడా వార్తలొచ్చాయి. అయితే ఇంతవరకు ఆమె ఎంట్రీపై క్లారిటీ రాలేదు. ఆమె నటించిన లేటెస్ట్ హిందీ మూవీ 'గుడ్ లక్ జెర్రీ' ప్రమోషన్స్ లో భాగంగా సౌత్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు మలయాళ దర్శకుడు ఆల్ఫోన్స్ పుత్రెన్ సినిమాలంటే చాలా ఇష్టమని, అలాగే తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో నటించాలని ఉందని జాన్వీ తెలిపింది.

మరి ఒకవేళ వెట్రిమారన్ నిజంగానే తారక్ తో సినిమా చేస్తే, దానిలో జాన్వీని తీసుకుంటాడేమో చూడాలి. వెట్రిమారన్ ఇటీవల కలిసి ఒక స్టోరీ చెప్పగా, తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. తారక్ లాంటి నటుడికి వెట్రిమారన్ దర్శకత్వంలో సినిమా పడితే అది ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే తారక్ ఫ్యాన్స్ ఈ కాంబినేషన్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరోవైపు 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు తారక్ డేట్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. మరి 'NTR 32' దర్శకుడు వెట్రిమారన్ అవుతాడో లేక బుచ్చిబాబు అవుతాడో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



