అప్పుడు మా అమ్మ, ఇప్పుడు ధర్మేంద్ర.. జాన్వీ కపూర్ కీలక వ్యాఖ్యలు
on Dec 2, 2025

-జాన్వీ కపూర్ అసలు ఏం చెప్తుంది.
-శ్రీదేవి మరణంపై ఎందుకు మాట్లాడింది
-మరి ధర్మేంద్ర మరణంపై కూడా ఏం చెప్తుంది
-మీడియా అత్యుత్సాహం చూపిస్తుందా!
ఎన్టీఆర్(Ntr)వన్ మాన్ షో 'దేవర'తో టాలీవుడ్ ని ఏలబోయే నెంబర్ వన్ హీరోయిన్ గా అభిమానుల్లో గుర్తింపు పొందిన భామ 'జాన్వీ కపూర్'(Janhvi Kapoor). అందుకు తగ్గట్టే ఇప్పుడు రామ్ చరణ్ పెద్ది(Peddi)తో నెంబర్ వన్ ప్లేస్ వైపు వేగంగా అడుగులు వేస్తుంది. తల్లి శ్రీదేవి(Sridevi)లా అందంలో గాని నటనలో గాని ప్రేక్షకులని కట్టిపడెయ్యడం జాన్వీ కపూర్ కి ఉన్న ప్లస్ పాయింట్. అక్టోబర్ లో 'సన్నీ సంస్కారికి తులసి కుమారి' అనే బాలీవుడ్ మూవీతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది.
రీసెంట్ గా జాన్వీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సెలబ్రటీస్ చనిపోయినప్పుడు కొన్ని మీడియా సంస్థలు వ్యూస్, లైక్స్ కోసం ఇష్టం వచ్చింది రాస్తున్నారు. మా అమ్మ మరణించినప్పుడు ఎలా అయితే అత్యుత్సాహం చూపించిందో, రీసెంట్ గా ధర్మేంద్ర(Dharmendra)గారు చనిపోయినప్పుడు కూడా అదే అత్యుత్సాహాన్ని చూపించింది. కొందరు ఆయన మరణం విషయంలో మరింతగా దిగజారి ప్రవర్తించారు. అది నిజమైన జర్నలిజం కాదు. నేను ఇండస్ట్రీలోకి రావడానికి కొన్ని నెలల ముందే మా అమ్మ చనిపోయింది. నా తొలి సినిమా ఫంక్షన్ లో మా అమ్మ గురించి మాట్లాడిన వాటిపై మీమ్స్ చేసారు. ఆ సమయంలో ఎంతో బాధపడ్డాను. నేను ఏం మాట్లాడినా తప్పుగా అనుకున్నారు.
also read: అఖండ 2 టాక్ ఎలా ఉండబోతుంది!
అసలు తల్లి మరణంపై కూతురు బాధపడుతుంటే దాన్ని కూడా అపహాస్యం చేస్తారని ఎవరైనా ఊహించగలరా!. అమ్మ మరణంపై కూడా ఎన్నో అవాస్తవాలు రాసారు. ఆ సమయంలో ఎంతో గందరగోళానికి గురయ్యాను. ఎప్పటికి కోలుకోలేనని భయపడ్డాను. ఆ తర్వాత అన్ని అర్ధం చేసుకొని నా పనిపై దృష్టి పెట్టాను. 2018 లో దఢక్ అనే హిందీ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఇప్పటి వరకు సుమారు పదకొండు చిత్రాల వరకు చేసింది. కానీ సక్సెస్ ని మాత్రం అందుకోలేకపోయింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



