దొంగచాటున జైలవకుశ టీజర్
on Jun 28, 2017

సినీ పరిశ్రమను లీకువీరులు భయపెడుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎడిట్ షూట్ లో వున్న మెటిరియల్ ను దొంగ చాటున లీక్ చేస్తున్నారు. తాజగా ఎన్టీఆర్ జై లవకుశ’ కూడా లీక్ బారిన పడింది. ఎన్టీఆర్ బాబీ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ‘జై లవకుశ’. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను జులై మొదటి వారంలో విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఈ లోగ ఈ సినిమా టీజర్ వేశాలు లీక్ అయ్యాయి. విశ్వ విశ్వపాలక, రావణ.. రావణ అనే బీజీతో సాంగ్ వస్తుంటే.. ఎన్టీఆర్ పాత్ర కారుదిగి బయటకు రావడం కనిపిస్తుంది ఈ లీక్ అయిన టీజర్ లో .
నెట్ లో కనిపిస్తున్న టీజర్ ను రంజాన్ కు విడుదల చేయాలనీ అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆగారు. అయితే ఇప్పుడు అనధికారికంగా టీజర్ విజువల్స్ బయటికి వచ్చాయి. టీజర్ ను చాలా గ్రాండ్ గా చూడాలని భావించిన ఎన్టీఆర్ అభిమానులు ఈ లీకేజీ తీవ్రంగా నిరాశపరిచింది. చిత్ర నిర్మాత కళ్యాణ్ రామ్ దీనిపై పోలీసులను ఆశ్రయించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



