రేస్ లో తప్పుకుంటే పవన్ కే ఇబ్బంది
on Jun 28, 2017
.jpg)
దసరా, సంక్రాంతి సినిమా విడుదలకి అతి పెద్ద సీజన్లు. వేరే వాళ్ళ సంగతి పక్కన పెడితే, మహేష్ బాబు తన సినిమాల్ని ఖచ్చితంగా ఈ రెండు పండగల్లో ఏదో ఒక పండగకి విడుదల చేసేలా చూసుకుంటాడు. ఈ సారి దసరాకి కూడా స్పైడర్ తో తన అభిమానుల్ని అలరించడానికి సిద్దమవుతున్నాడు మహేష్. కానీ, ఈ పండగకి పోటీ గట్టిగానే ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ జై లవ కుశ, బాలకృష్ణ పైసా వసూల్ కూడా దసరా సందర్బంగా వస్తున్నాయి. ఎంత పోటీ ఉన్నా హాలిడే సీజన్ కాబట్టి అన్ని సినిమాలకి భారీ ఓపెనింగ్స్ ఖాయం. మంచి టాక్ వచ్చిన సినిమాల ప్రభంజనం ఎక్కువ రోజులుంటుంది. అయితే, వీరితో పాటు, పవన్ కళ్యాణ్ కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న ఇంకా పేరు ఖరారు కానీ సినిమాతో రేస్ లో ఉన్నాడు. కానీ, తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా దసరా రేస్ నుండి తప్పుకొని దీపావళికి పోస్ట్ పోన్ అయిందంటున్నారు. సాధారణంగా దీపావళి సినిమాల విడుదలకి మంచి సీజన్ కాదు అంటారు. ఎంత కంపిటీషన్ ఉన్నా, పవన్ సినిమాని దసరాకి విడుదల చేయడమే ఉత్తమం అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ఈ సినిమా కూడా దసరాకి వచ్చుంటే అభిమానులకి అసలు పండుగ వాతావరణం కనిపించేది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



