ఎన్టీఆర్‌ని బాగా ఇరిటేట్ చేస్తున్నాడు...!
on May 16, 2017

వరుస హిట్ల తో జోరుమీదున్న ఎన్టీఆర్.. బాబికి ఛాన్స్ ఇవ్వడంతో చిత్రసీమ ఆశ్చర్యపోయింది. `సర్దార్ గబ్బర్ సింగ్` అనే అట్టర్ ఫ్లాప్ తరవాత.. బాబికి ఎన్టీఆర్ అవకాశం ఇస్తాడని ఎవరూ ఊహించలేదు. అయితే... బాబి తీసుకొచ్చిన కథ ఓ లెవిల్లో ఉండడంతో ఎన్టీఆర్ బాబి చేతిలో సినిమా పెట్టేశాడు. అయితే.. అదే ఎన్టీఆర్ చేసిన తప్పేమో అనిపిస్తోందట. సెట్లో బాబి ఎన్టీఆర్‌ని బాగా ఇరిటేట్ చేస్తున్నాడని, స్క్రిప్టులో రాసింది ఒకటి, తీస్తోంది ఒకటని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బాబిపై నమ్మకం లేకపోవడంతోనే ఎన్టీఆర్ తనకు కావల్సిన టీమ్‌ని సెట్ చేసుకొన్నాడట. బాలీవుడ్‌లో పీకేలాంటి చిత్రాలకు కెమెరామెన్‌గా పనిచేసిన సీకే మురళీధరన్‌ని పనిగట్టుకొని టీమ్ లోకి తీసుకొన్నాడు ఎన్టీఆర్.
కెమెరామెన్‌తో కలసి ఎన్టీఆరే ఈ సినిమాని లాగించేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కరుణాకరన్‌కీ... బాబికీ మధ్య ఏవో విబేధాలు కూడా వచ్చాయట. అందుకే మురళీధరన్ ఈ సినిమాని మధ్యలోనే వదిలేసి బాలీవుడ్ చెక్కేశాడని, అతని స్థానంలోనే చోటా కె నాయుడు వచ్చాడని తెలుస్తోంది. ఈ టోటల్ ఎపిసోడ్ విషయంలో.. ఎన్టీఆర్ చాలా ఆగ్రహంగా ఉన్నాడని, మున్ముందు మరింత మంది టెక్నీషియన్లు ఈ టీమ్ నుంచి తప్పుకొంటారేమో అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయని తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



