పుష్ప 2 నిర్మాతల ఇంటిపై ఐటి రైడింగ్స్
on Jan 21, 2025
.webp)
అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్(Mythri movie makers)దశాబ్ద కాలం నుంచి ఎన్నో హిట్ చిత్రాలని నిర్మించుకుంటూ వస్తుంది.మహేష్ బాబు(Mahesh Babu)హీరోగా కొరటాల శివ(Koratala Siva)దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీమంతుడు(Srimanthudu)తో మొదలైన మైత్రి సినీ ప్రస్థానంలో మొన్న వచ్చిన పుష్ప 2(Pushpa 2)వరకు ఎన్నో హిట్ సినిమాలు ఆ సంస్థ ఖాతాలో ఉన్నాయి.
ఈ రోజు ఉదయం నుంచి మైత్రి సంస్థల అధినేతలైన నవీన్(Yalamanchili Naveen)రవిశంకర్(Yalamanchili Ravi Shankar)కి సంబంధించిన ఇళ్లల్లో ఐటి సోదాలు జరుగుతున్నాయి.సిఇఒ చెర్రీతో పాటు సంస్థకి సంబంధించిన ముఖ్యమైన వాళ్ళ ఇళ్లల్లో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు.మరో అగ్ర నిర్మాత దిల్ రాజు ఇంట్లో కూడా ఈ రోజు ఉదయమే ఐటి దాడులు జరుగుతున్నాయి.ఇలా ఇప్పుడు రెండు ప్రతిష్టాత్మక సంస్థలపై ఐటి రైడింగ్ జరగడం తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
పుష్ప 2 తో మైత్రి మూవీ మేకర్స్ 1800 కోట్ల క్లబ్ లో కి కూడా చేరడం, దిల్ రాజు(Dil Raju)బ్యానర్ లో ఈ సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం(Sankrathiki Vasthunnam)మూవీ ఘన విజయం సాధించిన వేళ ఆ రెండు సంస్థల ఐటి దాడులు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.సంక్రాంతికి వచ్చిన మరో మూవీ గేమ్ చేంజర్(Game Changer) ని కూడా దిల్ రాజ్ నిర్మించిన విషయం తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



