హిందీలో డాకు మహారాజ్.. బాలయ్య బాక్సాఫీస్ తాండవం..!
on Jan 21, 2025

ఈమధ్య చిన్న సినిమాలను కూడా హిందీలో డబ్ చేసి నార్త్ లో విడుదల చేయడానికి మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటిది సీనియర్ స్టార్ నందమూరి బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్' చిత్రాన్ని తెలుగుతో పాటే హిందీ వెర్షన్ ను విడుదల చేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది. పైగా ఈ సినిమా కథ నార్త్ లోనే జరుగుతుంది. మేకింగ్ కూడా పాన్ ఇండియా సినిమాలకు ధీటుగా ఉంది. విజువల్స్ పరంగా, మ్యూజిక్ పరంగా ఎంతో పేరు వచ్చింది. అందుకే ఈ స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ ని హిందీలో విడుదల చేయాలని అభిమానులు కోరుతున్నారు. ఎట్టకేలకు అభిమానుల కోరిక నెరవేరబోతోంది. 'డాకు మహారాజ్' హిందీ వెర్షన్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. (Daaku Maharaaj)
'డాకు మహారాజ్' హిందీ వెర్షన్ జనవరి 24 నుంచి అందుబాటులోకి రానుంది. నార్త్ లో భారీ సంఖ్యలో థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది. పైగా హిందీ వెర్షన్ కు బాలకృష్ణనే డబ్బింగ్ చెప్పడం విశేషం. బాలయ్య డైలాగ్స్ కి ఎంతటి క్రేజ్ ఉంటుందో తెలిసిందే. వేరే వారు డబ్బింగ్ చెప్తే ఆ ఇంపాక్ట్ పోతుందనే ఉద్దేశంతో.. స్వయంగా బాలకృష్ణనే హిందీ డబ్బింగ్ చెప్పినట్లు సమాచారం.
'డాకు మహారాజ్' చిత్రానికి నార్త్ లో మంచి స్పందన వచ్చే అవకాశముంది. ఇది నార్త్ లో జరిగిన కథ కాబట్టి, అక్కడి ప్రేక్షకులు సినిమాని ఓన్ చేసుకునే ఛాన్స్ ఉంది. దానికితోడు హిందీ ప్రేక్షకులు మాస్ సినిమాలను బాగా ఇష్టపడతారు. అది చాలదు అన్నట్టుగా 'పుష్ప-2' తర్వాత అక్కడి ఆడియన్స్ ను మెప్పించే సరైన సినిమా రాలేదు. ఇవన్నీ కలిసొచ్చి హిందీలో 'డాకు మహారాజ్' మంచి వసూళ్లు రాబట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.160 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇక ఇప్పుడు హిందీ కలెక్షన్స్ కూడా తోడైతే బాక్సాఫీస్ దగ్గర మరిన్ని వండర్స్ క్రియేట్ చేస్తుంది అనడంలో సందేహం లేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



