`ఉప్పెన` హిందీ రీమేక్ లో ఇషాన్, అనన్య?
on Feb 23, 2021
ఈ వేలంటైన్స్ డే వీకెండ్ లో విడుదలైన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ `ఉప్పెన`.. బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిని హీరోహీరోయిన్లగానూ - బుచ్చిబాబు సానాని దర్శకుడిగానూ పరిచయం చేస్తూ హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా అనూహ్య విజయం సాధించింది. ఈ నేపథ్యంలో.. ఈ రొమాంటిక్ డ్రామాని కోలీవుడ్ స్టార్ విజయ్ తనయుడు సంజయ్ హీరోగా తమిళంలో రీమేక్ చేస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
కాగా, హిందీలోనూ `ఉప్పెన`ని రీమేక్ చేయబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రంలో ఇషాన్ ఖట్టర్, అనన్య పాండే జంటగా నటించబోతున్నరంటూ కథనాలు వస్తున్నాయి. అదే గనుక నిజమైతే.. `ఖాలీ పీలి` తరువాత ఇషాన్, అనన్య జోడీగా నటించబోయే సినిమా ఇదే అవుతుంది. త్వరలోనే `ఉప్పెన` హిందీ రీమేక్ కి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశముంది.
Also Read