రాజకీయాల్లోకి మంచు మనోజ్??
on Oct 22, 2018
.jpg)
నటుడు, నిర్మాత మంచు మోహన్‌బాబు రెండో కుమారుడు, యువ కథానాయకుడు మంచు మనోజ్ రాజకీయాల్లోకి వస్తారా? ఆదివారం సాయంత్రం ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక లెటర్ చూస్తుంటే వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం వున్నాయని అనిపిస్తోంది. ‘నా సినీ, రాజకీయ జీవితంపై ఎవరూ ఎలాంటి తీర్మానాలు చేయవద్దు’ అని మనోజ్ లెటర్‌లో పేర్కొన్నా... అంతకు ముందు లైన్లలో ‘నా వల్ల ఈ లోకానికి కలిగే ప్రయోజనం ఏంటో వెతికే క్రమంలో కొన్ని నెలలు తిరుపతికి షిఫ్ట్ అవుతున్నా’’ అనడం కొత్త చర్చకు తావిచ్చింది.
‘మన లక్ష్యం యొక్క లక్ష్యం మన చుట్టూ ఉండే ప్రజల్ని ఉద్ధరించేలా ఉండాలి’ అని మనోజ్ అంటున్నారు. ఆ లక్ష్యం రాజకీయాలేనా? లేదా ప్రజలకు సేవ చేయడానికా? మంచు కుటుంబం శ్రీ విద్యా నికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు చదువు చెప్పిస్తోంది. మరలా మనోజ్ ప్రత్యేకంగా తిరుపతికి వచ్చి రైతుల పిల్లలకు విద్యను పొందడంలో సహాయం చేస్తానని అనడం ఏమిటి? రాయలసీమలో ప్రయాణించే తన సరికొత్త ప్రయాణాన్ని ఆంధ్ర, తెలంగాణల్లో కొనసాగిస్తానని మంచు మనోజ్ పేర్కొన్నారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా వున్నాయని కొందరు అంటున్నారు. మనోజ్ వదిన, మంచు విష్ణు భార్య వెరోనికా స్వయానా జగన్ బాబాయ్ కుమార్తె. అలాగే, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబునాయుడు, బాలకృష్ణ తదితర ముఖ్యులతో సత్సంబంధాలు వున్నాయి. ఒకవేళ మనోజ్ రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీలో చేరతారో??
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



