అలియా... మహేష్ కుతూరుకు ఇష్టమయా!
on Oct 20, 2018

మహేష్ బాబు అంటే పడిచచ్చే అభిమానులు ఎంతోమంది వున్నారు. అందులో ఆరేళ్ళ నుంచి అరవై ఏళ్ళ వ్యక్తులు వుంటారు. మహేష్‌తో ఒక్క ఫొటో దిగాలని కలలు కంటారు. ఫొటో దిగితే ఎంత సంబర పడతారో మాటల్లో వర్ణించలేం. వాళ్ళ ముఖంలో చిరునవ్వుఆ వెలుగులు చూస్తే తెలుస్తుంది. మహేష్ కూతురు ముఖం ప్రస్తుతం అలా వెలుగుతోంది. ఎందుకో తెలుసా? తనకు ఇష్టమైన కథానాయికతో ఒక ఫొటో దిగింది సితార. ఇంతకూ మహేష్ కుమార్తె సితారకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా? హిందీ హీరోయిన్ అలియా భట్. ఈ సంగతిని మహేష్ సతీమణి నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు.
ప్రస్తుతం మహేష్ బాబు అమెరికాలోని న్యూయార్క్‌లో వున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్న 'మహర్షి' షూటింగ్ కోసం వెళ్ళారు. అతడితో పాటు నమ్రత, గౌతమ్ కృష్ణ, సితార వెళ్లారు. అలియా భట్ కూడా అమెరికా వెళ్ళడంతో ఆమెను కలిసే అవకాశం సితారకు దక్కింది. అప్పుడు ఒక ఫొటో దిగారు. దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన నమ్రత "సితారకు ఇష్టమైన అమ్మాయి (అలియా భట్). సితార ముఖంలోని చిరునవ్వుకు కారణమైనందుకు అలియాకు ధన్యవాదాలు అలియా" అని పేర్కొన్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



