యూట్యూబ్ లో దుమ్ములేపుతున్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్.. ఇన్ స్పెక్టర్ భరత్ రివ్యూ
on May 23, 2024

థియేటర్లలో హారర్, క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలకి ఉండే క్రేజే వేరు. అలాంటిది కొన్ని సినిమాలు ఓటీటీలోకి వచ్చాక అత్యధిక వీక్షణలు పొందుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు యూట్యూబ్ లోను దుమ్ములేపుతున్నాయి.
శ్రీ సెంథిల్ రచన, దర్శకత్వం వహించిన సినిమా ' ఇన్ స్పెక్టర్ భరత్'.. ఈ సినిమా 'కాళిదాసు' పేరుతో 13 Dec 2019 న తమిళంలో రిలీజైంది. ఆ తర్వాత ఓటీటీలోకి అనువదించారు. అయితే కొన్ని నెలల క్రితం ఈ సినిమాని యూట్యూబ్ లో తెలుగులో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా అత్యధిక వీక్షకాధరణ పొంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్ లిస్ట్ లో టాప్ లో ఉంది. మరి ఈ సినిమా కథేంటో ఓసారి చూసేద్దాం. తమిళనాడులోని ఓ సిటిలో ఓ అపార్ట్‌మెంట్ మీద నుండి ఒక అమ్మయి దూకి చనిపోతుంది. ఇక ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇన్ స్పెక్టర్ భరత్ వస్తాడు. ఆమె కేసులో ఎటువంటి క్లూ లేకుండా ఉంటుంది. ఇక అదే కోవలో కొన్ని వారాల తర్వాత వేరే బిల్డింగ్ మీద నుండి మరొకరు దూకి చనిపోతారు. రెండు కేసులలోను సాక్ష్యాలు పెద్దగా ఉండవు. ఆ ఇద్దరు దూకి చనిపోయిన బిల్డింగ్ లకి సీసీటీవి కెమెరాలు పనిచేయకుండా ఉంటాయి. ఇక అదే సమయంలో భరత్ భార్య విద్య.. ఇంట్లోనే ఉంటుంది. వంట చేయడం.. ఇల్లు చూసుకోవడం.. తన కూతురిని రెడీ చెయ్యడం.. స్కూల్ కి తీసుకెళ్ళడం.. ఇలా రోజంతా పనితో బిజీగా ఉంటుంది. ఇక భరత్ ఎప్పుడు కేసులు అంటు రాత్రి పగలు తేడా లేకుండా డ్యూటీకి ఇంపార్టెన్స్ ఇస్తాడు.
ఇక విద్య నిత్యం భరత్ తో గొడవ పడుతూనే ఉంటుంది. అదే సమయంలో విద్య ఉండే ఇంటి పైన ఉండే రూమ్ ని ఒక బ్యాచిలర్ కి అద్దెకు ఇస్తుంది. కొన్ని రోజుల్లోనే విద్య తనతో స్నేహం పెంచుకుంటుంది. ఇన్ స్పెక్టర్ భరత్ చూపించలేని ప్రేమని, ఆప్యాయతని అతని దగ్గర పొందుతుంది. మరోవైపు సిటీలో జరుగుతున్న వరుస సూసైడ్ లని ఇన్వెస్టిగేషన్ చేసే పనిలో భరత్ బిజీగా ఉంటాడు. తన భర్త నుండి విద్య ప్రేమని పొందగలిగిందా? సిటీలో సూసైడ్ ల వెనుక గల కారణమేంటో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మొదటి నుండి చివరి వరకు సాగే ఇన్వెస్టిగేషన్ ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కి బుర్ర పాడవ్వాల్సిందే. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాని ఇష్టపడే వారికి ఈ మూవీ ఓ ఫీస్ట్. యూట్యూబ్ లో ఉన్న ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి చూసేయ్యచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



