వగలమారి ఇల్లీ
on Jun 22, 2015
.jpg)
తలపాగా కట్టడం రాక తలొంకర అన్నాట్ట వెనుకటికొకడు. నాజూకు నడుము భామ ఇలియానా మాటలు ఇలానే ఉన్నాయి మరి. ఇల్లీ ఇల్లీ ఆఫర్లేవమ్మా అంటే...కొత్త దర్శకులు, కత్త హీరోయిన్ల వైపు వేలు చూపిస్తోందట. టాలీవుడ్ లో ఓ వెలుగువెలిగిన ఇల్లీ బాలీవుడ్ లో సత్తాచాటుకోలేక మళ్లీ ఇటువైపు లుక్కేస్తోంది.
గతంలో పిల్ల టెంపర్ చూపడంలో టాలీవుడ్ దర్శకనిర్మాతలు అమ్మడివైపు చూడలేదు. ఆ మధ్య త్రివిక్రమ్ పలకరించి ఓ హిట్టిచ్చాడు. అయితే ప్రస్తుతం తన చేతిలో రెండు ప్రాజెక్టులున్నాయని చెబుతున్న ఈ బ్యూటీ.....ఆఫర్లు తగ్గిపోవడానికి కారణాల లిస్ట్ ఏకరువుపెడుతోందట. ఇండస్ట్రీలో కొత్త దర్శకులు, కొత్త హీరో హీరోయిన్లు ఎక్కువవ్వడం వల్లే ఆఫర్లు తగ్గిపోయాయని గోముగా చెబుతోందట. దీంతో టాలీవుడ్ జనాలంతా అవాక్కయ్యారు.
పాతనీరు పోయి కొత్త నీరు రావడం కామన్. అయినా మేటరుండాలే కానీ వాళ్లొచ్చారు-వీళ్లొచ్చారు అని చిన్నపిల్లలా సాకులేంటి ఇల్లీ అంటున్నారు. మరి చేతిలో ఉన్న రెండు సినిమాలతో అమ్మడు దూసుకెళ్తుతుందంటారా? వెయిట్ అండ్ సీ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



