రాజోలు పిల్ల రూట్లో పడిందా?
on Jun 22, 2015
.jpg)
బాధపడితే కానీ బోధపడదట. తెలుగింటిపిల్ల అంజలిని చూసి అంతా ఇదే మాట. జర్నీ చేసివచ్చిన సీతమ్మని చూసి ముచ్చటపడి మసాలా నూరిస్తే...నోరూరించి పరారైంది. గొడవల్లో పడి కెరీర్ సంగతి పక్కనపెట్టింది.
ఇక అంతే సంగతులు అని అంతా అనుకున్న టైమ్ లో గీతాంజలి గామెప్పించి ఆఫర్లు చేజిక్కించుకుంటోంది. నిన్ననే బాలయ్యతో కొబ్బరికాయ కొట్టిన ఈ బ్యూటీ లేటెస్ట్ గా బందిపోటు రాణిగా కనిపించనుందట. నిఖిల్-నందిత జంటగా నటిస్తోన్న శంకరాభరణం లో అంజలి అదిరిపోయే క్యారెక్టర్ చేజిక్కించుకుందని టాక్.
బీహార్ లో జరిగిన ఓ యదార్థ కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అంజలికి నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దొరికిందట. అదే కాకండా...తనకు రీఎంట్రీలో లైఫ్ ఇచ్చిన కోనవెంకట్ ఈ మూవీకి నిర్మాతకావడం వల్ల కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. ఏమైతే ఏం...రాజోలు పాప మళ్లీ జోరందుకుంటోంది. ఇంతకీ గతేడాది దయ్యంపాత్రలో మెప్పించిన అంజలి....ఈ సారి బందిపోటు రాణిగా ఏమేరకు ఆకట్టుకుంటుందో చూద్దాం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



