"ఐస్ ఏజ్: కొల్లిజన్ కోర్స్" రివ్యూ!
on Jul 15, 2016
సాంకేతికవర్గం:
మ్యూజిక్: జాన్ డెబ్నే
సినిమాటోగ్రఫీ: రెనాటో ఫలాకో
నిర్మాణం: బ్లూ స్కై స్టూడియోస్
దర్శకత్వం: మైక్ తర్మైర్
నిడివి: 94 నిమిషాలు
విడుదల తేదీ: 15/7/2016
వయోభేదం లేకుండా అన్నివర్గాల ప్రేక్షకులూ మెచ్చిన హాలీవుడ్ యానిమేటెడ్ కామెడీ సిరీస్ "ఐస్ ఏజ్". ఇప్పటిక్వరకూ ఈ సిరీస్ లో మూడు సినిమాలు రాగా.. అన్నీ సూపర్ హిట్ అయ్యి కోట్ల రూపాయల వసూళ్లు సాధించాయి. తాజాగా ఈ సిరీస్ లో వచ్చిన నాలుగో చిత్రం "ఐస్ ఏజ్: కొల్లిజన్ కోర్స్". మరి ఈ తాజా చిత్రం మునుపటి మూడు చిత్రాల స్థాయిలో అలరించిందో లేదో చూద్దాం..!!
కథ:
అంతరిక్షం నుంచి పడుతున్న యాస్టిరాయిడ్స్ (గ్రహాంతర శకలాలు) మరికొద్ది గంటల్లో భూమిని తాకి.. భూమి అంతరించడం ఖాయమని తెలుసుకొన్న మ్యానీ అండ్ గ్యాంగ్ భూమి అంతమవ్వకుండా ఎలా కాపాడింది? అనే సీరియస్ కాన్సెప్ట్ కి కావాల్సినంత హాస్యాన్ని జోడించి తెరక్కించబడిన చిత్రమే "ఐస్ ఏజ్" తాజా చిత్రం.
విశ్లేషణ:
యానిమేషన్ సినిమా అవ్వడం వల్ల టెక్నికల్ గా మరియు కంటెంట్ పరమ్గా తప్పితే నటీనటుల గురించి చెప్పుకోవడానికి ఏమీ ఉండదు కాబట్టి.. డైరెక్ట్ గా టెక్నికల్ స్టఫ్ గురించి మాట్లాడుకుందాం. మునుపటి చిత్రాల స్థాయిలోనే "ఐస్ ఏజ్ 4" సినిమా కూడా యానిమేషన్ పరంగా అద్భుతంగా ఉంది. ఇక స్పేస్ ఎఫెక్ట్ గురించైతే చెప్పాల్సిన అవసరమే లేదు.. అసలు "బిగ్ బ్యాంగ్ థియరీ" మొదలుకొని "ఫ్రిక్షన్" వంటి ఎన్నో సైంటిఫిక్ ఇష్యూస్ గురించి చిన్నపిల్లలు మొదలుకొని పెద్దలవరకూ అందరికీ అర్ధమయ్యేలా చాలా ఈజీగా తెలియజెప్పాడు దర్శకుడు.
"ఐస్ ఏజ్" మొదటివెర్షన్ కు కథ సమమూర్చిన మైక్.. ఆ తర్వాత వచ్చిన పార్ట్ మొదలుకొని ఈ తాజా సిరీస్ కు డైరెక్టర్ గా వ్యవహరించాడు. కాకపోతే.. మునుపటి చిత్రాల స్థాయిలో హాస్యం పండలేదనే చెప్పాలి. అమెరికన్ కల్చర్ ను బాగా ఎలివేట్ చేసిన ఈ తాజా చిత్రం ఇండియన్ ఆడియన్స్ కు పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చు. చిన్నపిల్లలకు మాత్రం ఈ సినిమా విపరీతంగా నచ్చేస్తుంది. మ్యానీ, స్కార్ట్, బక్ ల యానిమేటెడ్ క్యారెక్టర్స్ వారిని కడుపుబ్బ నవ్విస్తాయి. సో, యానిమేషన్ సినిమాలను బాగా ఎంజాయ్ చేసే ఆడియన్స్ తమ పిల్లలతో సరదాగా చూడదగిన చిత్రం "ఐస్ ఏజ్: కొల్లిజన్ కోర్స్". తెలుగు మరియు హిందీ వెర్షన్స్ లోనూ ఈ సినిమా విడుదలైంది. కానీ.. ఈ సినిమాను 3డి వెర్షన్ లో చూస్తేనే మజా!
రేటింగ్: 2.5/5