ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి షాకింగ్ న్యూస్
on Jul 15, 2016
యంగ్‌టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న "జనతా గ్యారేజ్" సినిమా వాయిదా పడింది. సినిమాకు కొబ్బరికాయ కొట్టే టైంలోనే రిలీజ్ డేట్‌ను ఆగస్టు 12 అని ఫిక్స్ చేశారు. అయితే తాజాగా సినిమా విడుదలను సెప్టెంబర్ 2కు మార్చారు. ఎందుకంటే ఆ రోజు ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ పుట్టినరోజు. తన సినిమాను అదే రోజు విడుదల చేసి తండ్రికి బర్త్‌డే గిఫ్ట్ ఇవ్వాలని ఎన్టీఆర్ నిర్ణయించారు. ఎన్టీఆర్ కోరిక మేరకు చిత్ర నిర్మాతలు కూడా గ్యారేజ్‌ను సెప్టెంబర్ 2న రిలీజ్ చేస్తామని మాట ఇచ్చారట. సమంతా, నిత్యామీనన్ హీరోయిన్లుగా..మళయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ కంపోజ్ చేశాడట. అతి త్వరలో ఆడియో లాంచింగ్ జరుపుకొనుంది.